పదవ తరగతి లెక్కలు పరీక్ష సోమవారం ప్రశాంతంగా నిర్వహించారు. తాళ్లూరు మండలంలోని ఏడు పరీక్షా కేంద్రాలలో హిందీ పరీక్షలో 878 మందికి గాను 868
మంది హాజరు అయినట్లు మండల విద్యాశాఖాధికారి జి. సుబ్బయ్య తెలిపారు.
ఆయా పరీక్షా కేంద్రాల వద్ద ఎస్సె ప్రేమకుమార్ తన సిబ్బందితో పటిష్టబందోబస్తు నిర్వహించారు. గేట్ వద్దనే విద్యార్థుల హాల్ టికెట్స్ పరిశీలించి పరీక్షల ప్రాంగణంలోనికి అనుమతి ఇచ్చారు. ఎస్సె ప్రేమకుమార్, ఎంఈఓజి. సుబ్బయ్య, పలు పరీక్షా కేంద్రాలను సందర్శించారు.
