కురిచేడు మండలంలోని దేవనకొండ ప్రజల దాహార్తి తీర్చేందుకు తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకా యమ్మ హామీ ఇచ్చారు. దేవనకొండ కొండపై వేంచేసి ఉన్న శ్రీ యోగానంద లక్ష్మి నవనారసింహుల దివ్య ధామాన్ని ఆమె దర్శి మాజీ శాసనసభ్యుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డితో కలిసి సోమవారం సంద ర్శించారు. గ్రామస్తులు వెంకాయమ్మ, డాక్టర్ బూచేప ల్లి శివప్రసాద్ రెడ్డిలకు తాగునీటి సమస్య గురించి వివరించారు. అందుకు సానుకూలంగా స్పందించిన వారు సంబంధిత అధికారులతో ఎస్టిమేషన్ వేయిం చుకుని తమను కలవాలని సూచించారు. నూతనం గా నిర్మించిన ఆలయ ప్రతిష్ట జరిగి 41 రోజులైనందున శేషభట్టర్ గురూజీ ఆధ్వర్యంలో జరిగిన మం డల అభిషేక కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి మూల విరాట కు అభిషేకం చేశారు. అనంతరం జరిగిన హోమంలో పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. జెడ్పీటీసీ వెంకట నాగిరెడ్డి, కాకర్ల కృష్ణారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ కోలా సంతోష్ కుమార్, వీరగంథం కోటయ్య, సిద్ధి వెంకటరెడ్డి,
మునగాల కోటిరెడ్డి, రోశయ్య, పాతకోట వెంకటరెడ్డి, చిరంజీవి, నారాయణరెడ్డి, చంద్రమౌలి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
కల్లబొల్లి మాటలు కాదు.. చేతల ప్రభుత్వం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కళ్ల బొల్లి మాటలు చెప్పే ముఖ్యమంత్రి కాదని,అందరూ కలవరించేలా అభివృద్ధి పనులు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని గంగదొనకొండలో జరిగిన శ్రీ గంగాభవాని తిరునాళ్ల సందర్భం ఆయన మాట్లాడుతూ …దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంతగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్నని అన్నారు. చంద్రబాబుల కల్లబొల్లి మాటలు చెప్పి …కనిపించకుండా పోయే రకం కాదని కోవిడ్ కష్టకాలంలో కూడా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు ,ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్ దే అని అన్నారు. ఒకసారి ఎమ్మెల్యే కాని వారు కూడా ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని .. డాక్టర్ బుచేపల్లి ఎద్దేవా చేశారు . అమ్మ జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ దర్శి నియోజకవర్గంలో అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని.. ఇప్పటికే 10 కోట్లు ఖర్చుపెట్టినట్లు వివరించారు. సర్పంచ్ ఆసుపల్లి రామ లక్ష్మమ్మ, జెడ్పీటీసీ నుసుం వెంకట నాగిరెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ నాయకులు కాకర్ల కృష్ణారెడ్డి, గోగులముడి లింగారెడ్డి, పాతకోట వెంకటరెడ్డి, చిరంజీవి, అంకె కృష్ణ, కోలా డారు. సంతోష్ కుమార్, ధనిరెడ్డి వెంకటరెడ్డి, వీరగంథం కోటయ్య చిన్ని కార్తీక్, తెల్ల మేకల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.




