ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూముల రి సర్వే తో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని రీ సర్వే డిప్యూటీ తహసిల్దార్ టి రవికాంత్ అన్నారు. మండలంలోని జమ్మలమడక గ్రామంలో మంగళవారం రీ సర్వే పై గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రవికాంత్ మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పేరుకుపోయిన భూ సమస్యలను రీ సర్వే ద్వారా పరిష్కారం జరుగుతుందని అన్నారు. రైతులందరూ అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. మీ గ్రామాలలో డ్రోన్ కెమెరా ద్వారా సర్వే చేస్తున్న సమయంలో రైతులందరూ సకాలంలో అందుబాటులో ఉండాలన్నారు. మండలంలో మొట్టమొదటిగా శంకరాపురం గ్రామం రీ సర్వే పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం చిన్న ఉల్లగల్లు, బసవాపురం, జమ్మలమడక గ్రామాలలో రీ సర్వే జరుగుతుందన్నారు. గ్రామాలలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచి ఎన్ వెంకటేశ్వర్లు, వీఆర్వో పీ వేణుగోపాల్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి మొలకయ్య, సర్వేయర్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.
రీ సర్వే తో భూమి సమస్య లు పరిష్కారం
11
Apr