బిజెపి పార్టీ కార్యాలయంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

దర్శి బిజెపి పార్టీ కార్యాలయంలో బిజెపి దర్శి అసెంబ్లీ కన్వీనర్ మాడపాకుల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగినది . కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి కూకట్ల నాగేశ్వరరావు ముఖ్య అతిధి గా పాల్గొని చిత్రపటానికి పూలమాలవేసి అంజలి ఘటించారు.. వక్తలు మాట్లాడుతూ .. అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు ఆరాధ్యదైవం ,స్ఫూర్తి ప్రదాత ,మొట్టమొదటి మహాత్మా జ్యోతిరావు పూలే అని, అట్టడుగు వర్గాల కార్మికులకు, నిస్సహాయ స్థితిలో ఉన్న స్త్రీల గురించి ఆలోచించి వారి హక్కులకై పోరాడిన వ్యక్తి, వారికి స్వేచ్ఛ స్వాతంత్రం కల్పించిన మహనీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. జిల్లా ఉపాధ్యక్షుడు తిండి నారాయణ రెడ్డి మాట్లాడుతూ .. ఆయన మామూలు బడి పిల్లలకు చదువు చెప్పిన ఉపాధ్యాయుడే కాకుండా సమాజానికి చదువు చెప్పిన గురువని స్మరించుకున్నారు. లీగల్ సెల్ కో కన్వీనర్ బసవేశ్వర రావు మాట్లాడుతూ .. స్త్రీలు రైతులు కార్మికులు శూద్రులు వంటి వర్గాల గురించి మరియు వారి ఆర్థిక సామాజిక పరిస్థితుల గురించి ఆలోచించిన వ్యక్తి అని ఆయన ఆశయాల సాధన కొరకు కృషి చేద్దామని అన్నారు. కార్యక్రమంలో పట్టణ ఉపాధ్యక్షుడు చెందలూరి కొండయ్య శెట్టి , ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి జేష్ఠ ది ఆంజనేయులు , పట్టణ యువమోర్చా నాయకులు వంకదారు కుమార్, ఏవి నారాయణరెడ్డి, శివ కోటా చారి, మాచవరం ఆంజనేయులు, చల్లా వెలిగొండయ్య తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *