ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు శనివారం కోటి రూపాయలు విరాళంగా అందింది. హైద రాబాద్‌కు చెందిన ఎస్ఆర్సీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ తరపున ఏవీకే ప్రసాద్, ఏవీ ఆంజ నేయప్రసాద్ విరాళం డీడీని తిరుమలలోని చైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డికి అందజేశారు. టీటీడీ బోర్డు సభ్యుడు సనత్‌కుమార్ పాల్గొన్నారు. కాగా, తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 66,310 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. హుండీలో రూ.3.16 కోట్లు సమర్పించారు. దర్శన టికెట్లు లేని భక్తులకు 36 గంటల్లో స్వామివారి దర్శనం లభిస్తోంది.
ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.కోటి విరాళం
16
Apr