ప్రసిద్ది చెందిన కొత్తపాలెం పోలేరమ్మకు ఆదివారం పొంగళ్లు పెట్టి నైవేద్యాలు సమర్పించారు. పోలేరమ్మ దేవస్థానం జీర్నోద్ధారణ జరిగి తొమ్మిది సంవత్సరములు కాగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా గ్రామస్తులు ఐకమత్యంగా పొంగళ్లు చెల్లిస్తున్నారు. పొలేరమ్మ, పోతురాజు విగ్రహాల వద్ద, అమ్మవారికి పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. వర్షాలు కురిపించి పశుపక్షాదులు చల్లాగా చూడాలని వేడుకున్నారు. గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో ఉత్సాహంగా గ్రామోత్సవం పాల్గొన్నారు. గ్రామానికి బంధువులు, స్నేహితులు తరలిరావటంతో ఉత్సవం కనుల పండువగా జరిగింది. వైఎస్సార్సీపీ తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, హౌసింగ్ వేర్ కార్పోరేషన్ చైర్మన్ ఎంఎం ప్రసాద్ రెడ్డి, మండల జెసీఎస్ కన్వినర్ యాడిక శ్రీనివాస రెడ్డి, సర్పంచిలు వలి, పీఎస్ శ్రీకాంత్ రెడ్డి, కో ఆప్షన్ మెంబర్ కరిముల్లా, కౌల్సిలర్ వీసీ రెడ్డి, మాజీ సర్పంచి హనుమంతరావు, గంగిరెడ్డి పాలెం యలమందా రెడ్డిలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

