గ్రామైఖ్య సంఘాలు ప్రకృతి వ్యవసాయాన్ని పోత్సహించి తాము సాగు చేసి మిగిలిన పొదుపు సంఘ సభ్యులను కూడ సాగు చేయించే విధంగా కృషి చెయ్యాలని వ్యవసాయాధికారి ప్రసాదరావు కోరారు. స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయంలో సోమవారం ప్రకృతి సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 2023-24 సంవత్సరంలో ప్రకృతి సాగుపై ప్రకృతి వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి నాగంబొట్లపాలెం, తూర్పుగంగవరం గ్రామాలలొ 8 యూనిట్లలో ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఎపీఎం దేవరాజ్ మాట్లాడుతూ పొదుపు సంఘాలు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఇస్తున్న ప్రోత్సహాలను ఉపయోగించుకుని ప్రకృతి సాగు ప్రొత్సహించి ఆరోగ్యాన్ని, ఆదాయాన్ని పొందాలని కోరారు. ప్రకృతి సాగు ఇన్చార్జి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామైఖ్య సంఘాలు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రొత్సహించాలి- వ్యవసాయాధికారి ప్రసాదరావు
17
Apr