పొదుపు గ్రామైఖ్య సంఘ సభ్యులు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచుకుని చిరుధాన్యాలు, ప్రకృతి సాగును గ్రామాలలో ప్రోత్సహించాలని ఎపీఎం దేవరాజ్ కోరారు. వ్యవసాయశాఖ, వైఎస్సార్ క్రాంతి పథకం మహిళలు బుధవారం సంయుక్తంగా అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారి ప్రసాదరావు మాట్లాడుతూ ప్రభుత్వం రైతు సాధికార సంస్థ ద్వారా అమలు చేస్తున్న అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులను ఇచ్చే దిశంగా, భూ సార పరిరక్షణకు కూడ రైతులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. వర్షాభావ పరిస్థితులను తట్టుకుని ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోనే శక్తి ప్రకృతి వ్యవసాయానికి ఉందని చెప్పారు. ప్రకృతి వ్యవసాయ ఇన్చార్జి నరసింహులు మాట్లాడుతూ ఆరోగ్య కరమైన ఉత్పత్తులను ప్రజలకు అందించటమే కాకుండా ఆర్థికంగా రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించి వెల్లంపల్లి బస్టాండ్ కేంద్రంలో మానవహారం ఏర్పాటు చేసారు. కార్యక్రమంలో ఎంఎంఎస్ అధ్యక్షురాలు విజయలక్ష్మి, సీసీలు కోటేశ్వరమ్మ విఏఏ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామైఖ్య సంఘ సభ్యులు ప్రకృతి వ్యవసాయ ప్రాముఖ్యతను రైతులకు వివరించాలి అవగాహన కల్పిస్తూ ర్యాలీ – మానవ హారం ఏర్పాటు
19
Apr