వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అభ్యున్నతికి మాజీ వార్డు మెంబర్ మస్తాన్ వలి సేవలు మరువలేనివని ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి అన్నారు. రాజానగరంలో మాజీ వార్డు మెంబర్ షేక్ మస్తాన్ వలి (85) బుధవారం గుండెపోటుతో మృతి చెందాడు. ఆయనకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. ప్రజా ప్రతినిథులు సర్పంచి వలి, ఎంపీపీ, జెడ్పీటీసీలు ఆయన మృత దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు.
మస్తాన్ వలి సేవలు మరువలేనివి – నివాళులు అర్పించిన ప్రజా ప్రతినిధులు
19
Apr