ప్రజలు తీసుకునే ఆహారం అలవాట్లపై ఆరోగ్య కేంద్ర పరిధిలో ఇంటింటి సర్వే చేపట్టడం జరుగుతుందని వైద్యాధికారిని వి జ్యోతి అన్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆహారపు అలవాట్లపై జిల్లాస్థాయిలో 38 మండలాల్లో వైద్య శాఖ అధికారులు సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో ముళ్ళమూరు మండలం కూడా ఉంది. అందులో భాగంగా బుధవారం నుండి మండల కేంద్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసి మైనార్టీలకు సంబంధించిన పది గృహాలు సందర్శించి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ ఆహారం తీసుకుంటారు వారి నుంచి సమాధానం రాబట్టారు. మీరు తీసుకునే ఆహారంలో కేలరీల గురించి వారికి వివరించారు. బలమైన ఆహారం తీసుకున్నట్లయితే ఆరోగ్యాలు బాగా ఉంటాయని తెలియజేశారు. రక్తహీనత గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ పోషక విలువలు ఉండే ఆహారం తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ నారాయణరావు, హెచ్ వి కన్యాకుమారి, హెచ్ ఎస్ సుబ్బారావు, ఎం ఎల్ హెచ్ పి, సి హెచ్ ఓ లు పాల్గొన్నారు .
ఆహారపు అలవాట్లపై ఇంటింటి సర్వే
19
Apr