ఒంగోలు భాగ్యనగర్ లోని ఈవీఎం గొడౌన్ ను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిథులు పరిశీలించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 12 నియోజక వర్గాల ఈవీఎంలను, బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వీవీ ప్యాడ్స్ ను పరిశీలించారు. గోడౌన్ల లోపల పరిస్థితిని క్షున్నంగా పరిశీలించి తగిన సూచనలు చేసారు. డిఆర్డీఓ రామిశెట్టి శ్రీలత, జిల్లా ఎలక్షన్ సెల్ సూపరిండెంట్ రాజ్యలక్ష్మి, జిల్లా డీటీ సన్మాన్, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి దామరాజు క్రాంతి కుమార్, బిజెపి, టిడిపి, కాంగ్రెస్ పార్టీల ప్రతినిధులు గుర్రం సత్యనారాయణ, కాలేషా బేగ్, షేక్ రసూల్, ఒంగోలు మండల డిటీ సల్మాన్, ఆయా మండలాల డీటీలు, ఎన్నికల సెల్ అధికారులు పాల్గొన్నారు.
