తాళ్లూరు మండలంల బొద్దికూరపాడు గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక (ఎస్సీ విఆర్) పాఠశాలలో నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటైన వాటర్ ప్లాంట్ ను ఎంఈఓ జి. సుబ్బయ్య పరిశీలించారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థినీ విద్యార్థుల త్రాగునీటి సౌకర్యం కొరకు ఏర్పాటుచేసిన వాటర్ ప్లాంట్ మరమ్మత్తులకు గురవటంతో ఇటీవల మరమ్మత్తులు నిర్వహించారు. దీంతో వాటర్ ప్లాంట్ పనితీరును పరిశీలించి సౌకర్యాలను జాగ్రత్తగా వినియో గించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాలప్రధానోపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయులు, విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
బొద్దికూరపాడులో వాటర్ ప్లాంట్ ను పరిశీలించిన ఎంఈఓ జి సుబ్బయ్య
20
Apr