వైయస్ఆర్సీపీ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని సర్పంచి వరగాని బాల సుందర రావు అన్నారు. మండలంలోని పసుపుగల్లు గ్రామంలో ఎస్సీ కాలనీలో జగనన్న మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే, జగన్ కార్యక్రమం గురువారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ బాల సుందర రావు మాట్లాడుతూ జగనన్న సంక్షేమం అభివృద్ధి ప్రతి ఇంటింటికి చేరిందని అన్నారు మళ్లీ ఆయనే సీఎంగా కావాలని అన్నారు. వాలంటీర్ల సహాయంతో ఇంటింటికి తిరిగి సంక్షేమం గురించి మహిళలకు వివరించారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్ అశోక్, మహిళలు పాల్గొన్నారు.
