రంజాన్ ను శనివారం ముస్లీం సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు. అధిక సంఖ్యలో ముస్లీం సోదరులు పాల్గొని భక్తి శ్రద్ధలతో నవాజ్ లు నిర్వహించారు. తూర్పుగంగవరం, రామభద్రాపురం, శివరామపురం, మల్కాపురం, బొద్దికూరపాడు, గంగపాలెంలలో ముస్లీం సోదరులు ప్రత్యేక నవాజ్లు నిర్వహించారు.. ఒకరికి మరోకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కోఆప్షన్మెంబర్ కరిముల్లా నివాసంలో ఎంపీపీ, తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీ ఐ. వెంకటేశ్వర రెడ్డి, మాజీ ఎఎంసీ చైర్మన్ ఐ. వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర హౌసింగ్ వేర్ కార్పోరేషన్ డైరెక్టర్ ఎంఏ ప్రసాద్ రెడ్డి, కౌల్సిలర్ వీసీ రెడ్డి తదితరులు పాల్గొని శుభాకంక్షలు తెలిపారు. మల్కాపురం మాజీ సర్పంచి వలి తదితరులు మల్కాపురంలో ప్రత్యేక నవాజ్లలో పాల్గొన్నారు. జిల్లా కోఆప్షన్ మెంబర్ ఆదాం షరీష్ ముస్లీం సోదరులకు రంజాన్ శుంభాకాంక్షలు తెలిపారు.
