మండు వేసవిలో వడగండ్ల వానతో ముండ్లమూరు మండలం తడిసి ముద్దయింది. ముండ్లమూరు మండలంలోని ముండ్లమూరు, పసుపుగల్లు, ఉలగల్లు ,పులిపాడు, రమణారెడ్డి పాలెం, వేముల, తమ్మలూరు ,ఉమామహేశ్వరపురం, నాయుడుపాలెం ,మారెళ్ళ, మక్కినేనివారిపాలెం, వేంపాడు ,శంకరాపురం, సింగనపాలెం, పూరిమెట్ల, భీమవరం, ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పసుపు గళ్ళు , ముండ్లమూరు తమ్మలూరు, నాయుడుపాలెం, ఉమామహేశ్వరరావు, సుంకర వారి పాలెం. మిర్చి పంట రైతులు కల్లాల్లో ఆరబెట్టిన మిరపకాయలను కాపాడుకునేందుకు పొలాలకు పరుగులు పెట్టారు. అప్పటికే కొంత మేర ఎండు మిరపకాయలు తడిసిపోయాయని రైతులు ఆవేదన చేస్తున్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం దాటికి వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. గంట పాటు వర్షం పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మండుటెండలకు వర్షం పడడంతో చల్లగా ఉండటంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.


