గురుకుల పాఠశాల వద్ద ప్రవేశ పరీక్షలో పాల్గొన్న విద్యార్థులకు మజ్జిగ , పులిహోర పంపిణీ

దర్శి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆదివారం పులిహోర, మజ్జిగను పంపిణీ చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలుర గురుకుల పాఠశాలలో ఆదివారం ఐదవ తరగతి, ఇంటర్ ప్రథమ సం వత్సరంలో చేరేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలకు హాజరైన 250 మంది విద్యార్థులు, తల్లిదండ్రులకు లైన్స్ క్లబ్ అధ్యక్షుడు నారపుశెట్టి మధు సొంత నిధులతో పులిహోర, మజ్జిగ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండలు మండుతున్నందున విద్యా ర్థులకు తమవంతు సహకారంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలి పారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు డాక్టర్ పెద్దిరాజు, రామాంజ నేయులు, కల్లూరి విద్యాసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *