గ్రామ పంచాయతీల సమగ్రాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని, అందరూ కలిస్తేనే అభివృద్ధి సాధ్యమని ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానంద రెడ్డి అన్నారు. స్థానిక మండల పరిషత్ సమావేశపు హాలులో సోమవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం కార్యక్రమం ఎంపీడీవో కే కుసుమ కుమారి అధ్యక్షతన జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానంద రెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామ సభల్లో గ్రామ ప్రజాప్రతినిధులు వార్డు మెంబర్లు ప్రజలందరూ గ్రామ సభల్లో పాల్గొని సమస్యలు పరిష్కరించుకొని అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఎంపీడీవో కే కుసుమకుమారి మాట్లాడుతూ గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడానికి రాజ్యాంగంలో సవరణలు చేయడం జరిగిందన్నారు. ఎవరి పైన ఆధారపడకుండా ప్రజల భాగస్వామ్యంతో తీర్మానాలు చేసుకొని అభివృద్ధి పనులు చేసుకోవాలన్నారు జిల్లా పరిషత్ నుంచి నేరుగా నిధులు గ్రామపంచాయతీలకు కేటాయిస్తామని, వీటిని సద్వినియోగం చేసుకొని గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. అనంతరం కొన్ని గ్రామపంచాయతీలకు అవార్డులు ప్రకటించారు. అందులో మారళ్ళ, పులిపాడు, జమ్మలమడక, ఉలగల్లు, పసుపుగల్లు, ముండ్లమూరు, పూరిమెట్ల, సింగనపాలెం, భీమవరం , ఈదర పంచాయతీలకు అవార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి తాతపూడి మోజేష్ రత్నం రాజు, ఈవో పి ఆర్ డి ఓబులేసు, వైస్ ఎంపీపీ వేముల పద్మ జానకి రామయ్య, వైస్ ఎంపీపీ బంక రమణమ్మ నాగిరెడ్డి, సర్పంచులు ముక్కుమల్ల శ్రీనివాస్ రెడ్డి, గోపన బో యిన వెంకటేశ్వర్లు శ్రీనివాసరావు , జనామాల నాగేంద్రం పిచ్చయ్య, వరగాని బాల సుందర రావు, ఓ గులూరు రామాంజి, గండి గురవయ్య, కందిమల్ల గీతాంజలి, అనమలమూరి సుజాత వెంకటరావు, వంగల పద్మావతి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు రాజరాజేశ్వరి, రాధాకృష్ణ, బి శ్రీనివాసరావు, మధుబాబు, రాజశేఖర్ రెడ్డి, అంజమ్మ, రమేష్, శ్రీనివాసరావు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు .

