పంచాయితీ రాజ్ దినోత్సవాన్ని తాళ్లూరు సచివాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. తాళ్లూరు సర్పంచి మేకల చార్లెస్ సర్జన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ ఐ. వెంకటేశ్వర రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎంపీపీ తాటికొండ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో సచివాలయ, వలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చి ప్రజల ముంగిటకు సేవలు అందిస్తున్నారని అన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సీఎంజగన్తోనే సాధ్యమైనదని అన్నారు.స్వచ్ఛ దూత్ లు అబ్రహం, పిచ్చలను ఘన సన్మానం నిర్వహించారు. ముందుగా మహాత్మాగాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కోఆప్షన్మెంబర్ కరిముల్లా, ఈఓఆర్డీ ఎన్. యూ ప్రసన్నకుమార్, చిరంజీవిలు పాల్గొన్నారు.

