ఐసీడీఎస్ ప్రాజెక్టు పున్వర్విభనలో బాగంగా తాళ్లూరు ఐసీడీఎస్ ప్రాజెక్టును దర్శి పట్టణంలోనికి మార్పు చేసినట్లు సీడీపీఓ సీహెచ్ భారతి తెలిపారు. దర్శి పట్టణంలో కురిచేడు రోడ్‌లోని వ్యవసాయ మార్కేట్ యార్డ్‌తో వైఎస్సార్ అగ్రిటెస్టింగ్ ల్యాబ్ ప్రక్కనకు మార్పు చేసినట్లు చెప్పారు. తాళ్లూరులో ప్రాజెక్టు కార్యాలయాన్ని కూడ తమ శాఖలో జరుగు పలు సమావేశాలకు, స్టాకు పాయింట్‌గా మార్పు చేసుకోనున్నట్లు చెప్పారు. దర్శిలో సోమవారం ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాన్ని సీడీపీఓ సీహెచ్ భారతి, ఎసీడీపీఓ అంజమ్మతో పాటు సూపర్వైజర్లు హేమలత, జ్యోతి, సునీత, అనురాధ, కమల కుమారి. యశోద, అనంద లత, అంగన్వాడీ టీచర్లు తదితరులు సందర్శించారు.
