“సి.రాఘవాచారి ప్రెస్ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్” పేరును “సి.రాఘవాచారి మీడియా అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్” గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ శ్రీ. తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సి.రాఘవాచారి ప్రెస్ అకాడమీగా ఉన్న అకాడమీ పేరును మార్చాల్సిన అవసరాన్ని ఆయన వివరిస్తూ గతంలో మీడియా అంటే న్యూస్ పేపర్లుగా మాత్రమే పరిగణింపబడేదని, నేడు మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మధ్య సమానత్వం ప్రతిబింబించేలా “సి.రాఘవాచారి ప్రెస్ అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్” పేరును “సి.రాఘవాచారి మీడియా అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్” గా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రాఘవాచారి గౌరవార్థం ముఖ్యమంత్రి శ్రీ. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి 2019లో “ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ” పేరును “సి.రాఘవాచారి ప్రెస్ అకాడమీ”గా మార్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇకపై సి.రాఘవాచారి మీడియా అకాడమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌గా సి.రాఘవాచారి ప్రెస్ అకాడమీ
24
Apr