జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మనమడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి, నందిని గార్ల కుమారుడు చిరంజీవి బూచేపల్లి విద్యాధర రెడ్డి జన్మదిన సందర్భంగా బూచేపల్లి యూత్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు, అన్నదానం నిర్వహించారు. బూచేపల్లి నివాసంలో కుటుంబసభ్యులు, బంధువులు, అనుచరుల మధ్య కేక్ ను కట్ చేసి విద్యాధర్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.




