దర్శి నియోజకవర్గంలోని కొందరు ప్రజా ప్రతినిధుల రూటే సపరేట్ గా మారింది…వీళ్ళు రాజకీయాల్లోకి రావడం ప్రభుత్వ భూముల కోసమే అన్నట్టు ఉంది వారి వ్యవహార తీరు…భూముల రేట్లు ఆకాశాన్ని అందడంతో కొందరు బి గ్రేడ్ పొలిటికల్ లీడర్స్ కన్ను సర్కార్ భూములపై పడింది. వాగులు వంకలు కుంటలు కూడా చదును చేస్తూ రియల్ వ్యాపారం రియల్ గా చేస్తున్నారు.ఎవరైనా ప్రశ్నిస్తే వారిని డబ్బుతో కొడుతున్నారు. దర్శి నియోజకవర్గంలో ప్రధానంగా దర్శి దొనకొండ ప్రాంతాలలో భూముల రేట్లకు రెక్కలు రావడమే దర్శి నియోజకవర్గం లో రియల్ వ్యాపారానికి రెక్కలు తీసుకువచ్చింది. అసైన్మెంట్ భూములు, డీకే భూములను నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేయడం, పక్కనే కొంత పట్టా ల్యాండ్ చూసుకోవడం అంతా పట్టా భూమి అన్నట్టు సర్వే నంబర్లు మార్చి మరీ రిజిస్ట్రేషన్ లు చేస్తున్నారంటూ ఊహాగానాలు వస్తున్నాయి. కొందరు ప్రభుత్వ అధికారులు కుడా ప్రభుత్వ భూముల్లో పాత్రధారులు అంటూ కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ భూములతో వ్యాపారం చేసే కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా మరో చేదు ఎదురవుతుంది. అంతా చదును చేసి వ్యాపారం మొదలవుతున్న టైం చూసి కొందరు ఈ భూములు మావి అంటూ మరికొందరు జెండాలు బాతే పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇటీవల దర్శి దొనకొండ ప్రాంతాలలో అది పూర్తిగా బట్టబయలైంది. దీంతో అటువంటి భూములు కొనే సామాన్యుడి పరిస్థితి ఏమవుతుందో అని అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు రెవిన్యూ అధికారులు కూడా ప్రభుత్వ భూములు అంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోతుంది. పెద్దపెద్ద నిర్మాణాలకు మాత్రం కేవలం నోటీసులు ఇచ్చి అధికారులు కూడా చేతులు దులుపుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటే తప్ప సర్కార్ భూములు కాపాడే పరిస్థితిలో లేవని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.
దర్శి నియోజకవర్గంలో వాళ్ల టార్గెట్ – సర్కార్ ల్యాండ్స్
25
Apr