ముండ్లమూరు రెవిన్యూ పరిధిలో గల సర్వే నెంబర్ 199 లో అక్రమ ఆన్లైన్ తొలగించి అర్హులకు న్యాయం చేయాలని కోరుతూ ముండ్లమూరు గ్రామానికి చెందిన మాజీ సైనికుడు మువ్వా కోటేశ్వరరావు సోమవారం తహసీల్దార్ నయీమ్ అహమ్మద్ కు స్పందన కార్యక్రమంలో వినతి పత్రం అందజేశారు. వివరాల్లోకి వెళితే…. ముండ్లమూరు గ్రామంలో సర్వేనెంబర్ 199లో 20 ఎకరాల 90 సెంట్లు భూమి కలదు. ఈ భూమిని ఆరు అరకల చేను అంటారు. ఇందులో మువ్వా నాంచారమ్మ భర్త గురుస్వామికి ఒక ఎకరం 49 సెంట్లు భూమి ఉంది. అయితే ఈ భూమి నేటికీ సబ్ డివిజన్ చేయకుండానే అధికారులు కాసులకు కక్కుర్తి పడి ఎక్కువ డబ్బులు ఇచ్చిన వారికి వేరే వారి పేరు మీద ఉన్న భూమిని లంచాలు తీసుకొని భూమిని ఆన్లైన్ చేసి అక్రమ పద్ధతిలో పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేసి ఉన్నారని ఆరోపించారు. ఇటీవల తన భూమి ని ఆన్లైన్ చేయమని అధికారులకు అర్జీ దాఖలు చేయగా ఈ భూమిని వేరే వాళ్లకు ఆన్లైన్ చేసి ఉన్నారని తెలుసుకున్నట్లు చెప్పారు. జిల్లా అధికారులు దృష్టి సారించి రెవెన్యూ రికార్డులు పరిశీలించి న్యాయబద్ధంగా నా భూమిని మాకు ఆన్లైన్ చేసి న్యాయం చేయాలని విన్నవించారు. అక్రమ ఆన్లైన్ రద్దు చేసి భాగస్వాములు సమక్షంలో భూమిని పంపిణీ చేసి న్యాయం చేయాలని కోరారు.
