అర్హులైన కౌలురైతులకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలి – కెనరా బ్యాంక్ మేనేజర్ ను కలిసి విన్నవించిన వ్యవసాయ అధికారి ప్రసాదరావు

అర్హులైన కౌలు రైతులకు బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని తద్వారా సాగు ఖర్చులకు తోడ్పాటునందించి నట్లు అవుతుందని మండల వ్యవసాయాధికారి బి. ప్రసాదరావు బ్యాంకర్లను కోరారు. తాళ్లూరులో కెనరా బ్యాంక్ మేనేజర్ ను కలసి వ్యవసాయ అధికారి కౌలు రైతుల పరిస్థితిపై వివరించారు. తాళ్లూరు మండలంలో ప్రస్తుతం పంట సాగుదారు హక్కు పొందిన రైతులు ఓసిలు 521 మంది, బిసిలు 106 మంది యస్.సిలు 97 మంది, యస్. టిలు 6 మంది, మైనారిటీ లు 8 మంది, ఇతరులు 2 ఉన్నారని వ్యవసాయ అధికారి తెలిపారు. వారందరి యొక్క వివరాలను సంబంధిత బ్యాంకు మేనేజర్లను అందించారు. వారిని పరిశీలించి, అర్హులైన వారికి పరిమితులను బట్టి రుణాలు మంజూరు చేస్తామని బ్యాంకు మేనేజర్లు తెలిపారు. సదరు భూమిపై యజమాని బ్యాంకు రుణం పొంది ఉంటే, మరలా కౌలుదారుకు అదే భూమిపై రుణంసాధ్యం కాదని బ్యాంకు మేనేజర్లు తెలిపారు. అయితే కౌలు రైతులకు పంట సాగుకు మాత్రం రుణం మంజూరు చేయాలని … వ్యవసాయ అధికారి విన్నవించారు.
కార్యక్రమంలో కెనరా బ్యాంకు మేనేజరు ధర్మసాయి, ఫీల్డ్ ఆఫీసర్ అరవిందన్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *