డ్రాగన్ ఫ్రూట్ తోటలతో బహుళ ప్రయోజనాలు – డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ ను సందర్శించిన జిల్లా ఉద్యానవన శాఖ అధికారి వై గోపిచంద్

డ్రాగన్ ఫ్రూట్ తోటతో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి వై గోపిచంద్ అన్నారు. తాళ్లూరు మండలం మాధవరం గ్రామానికి చెందిన రైతు ఏర్పాటు చేసిన ఎస్. వి.ఎస్ ఆగ్రో ఫామ్ ను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యానవన శాఖ అధికారి వై గోపిచంద్ మాట్లాడుతూ.. డ్రాగన్ ఫ్రూట్ తోటను ఒక్క సంవత్సరం కష్టపడి సాగు చేస్తే 25 సంవత్సరాల పాటు రైతులకు ఫలాన్ని ఇస్తూ ఆర్థికంగా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. మొదట కాస్త పెట్టుబడి ఎక్కువగా ఉన్నా తర్వాత నిర్వాహణ వ్యయం మాత్రమే ఉంటుందని చెప్పారు. తక్కువ నీటి ఖర్చుతో సాగు చేసే డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ప్రతి ఒక్కరూ మొగ్గు చూపాలని సూచించారు. మిగిలిన పంటలతో పోలీస్తే డ్రాగన్ ఫ్రూట్ తెగుళ్ల బారిన తక్కువగా పడే అవకాశాలు ఉన్నాయని అన్నారు.. తోటను రైతు రామి రెడ్డితో కలసి తిరిగి పరిశీలించారు. డీఎల్పీఓ మూల వెంకట రెడ్డి పొత్సాహంతో తోటను అభివృద్ధి పరచినట్లు రైతు తెలిపారు. తోటను పరిశీలించి ఆరోగ్యవంతంగా సేద్రీయ పద్దతిలో పెంచుతున్న రైతును అభినందించారు. తక్కువ వ్యయంతో సాగు చేసేందుకు మరింత మెరుగైన పద్దతులు సూచించారు. అనంతరం తోట వద్దనే ఎస్.వి.ఎస్ ఆగ్రో ఫామ్ ఏర్పాటు చేసిన సెల్స్ పాయింట్ ను ప్రారంభించారు. వినియోగదారులకు తక్కువ ధరలో మంచి పోషకారం అందుబాటులో ఉంటుందని వినియోగించుకోవాలని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *