నులిపురుగుల దినోత్సవం (డీ వార్మింగ్ డే) ను విజయవంతం చెయ్యాలని మండల విద్యాశాఖాధికారి జి. సుబ్బయ్య కోరారు. తాళ్లూరు మండలంలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది సహకారంతో విజయవంతానికి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి విద్యార్థి మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత అరగంటకు వైద్య సిబ్బంది సూచనలు మేరకు మాత్రలు మింగించాలని కోరారు. ఆల్బెండాజోల్ మాత్రలు ఆయా పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు ఇప్పటికే కేటాయించినట్లు తాళ్లూరు పీహెచ్ సి వైద్యాధికారి ఖాదర్ మస్తాన్ బి, తూర్పు గంగవరం పీహెచ్ సి వైద్యాధికారి బి. రత్నం తెలిపారు. తమ పరిధిలోని పాఠశాలలకు ఇప్పటికే విద్యార్థుల సంఖ్య ప్రకారం మాత్రలు సంబంధిత ఆరోగ్య సిబ్బందికి అందజేసినట్లు చెప్పారు. పూర్తి స్థాయి విజవంతానికి ఆరోగ్య సిబ్బందికి తగిన సూచనలు చేసినట్లు తెలిపారు.
డీ వార్మింగ్ డే ను విజయవంతం చెయ్యాలి – విద్యార్థులకు ఆల్ బెండా జోల్ మాత్రలు మింగించాలి – తాళ్లూరు మండల విద్యాశాఖాధికారి జి. సుబ్బయ్య – తాళ్లూరు, తూర్పు గంగవరం పీహెచ్ సి పరధిలో విజయవంతానికి తగిన చర్యలు – తాళ్లూరు పీహెచ్ సి, తూర్పు గంగవరం పీహెచ్ సి వైద్యాధికారులు వెల్లడి
09
Aug