చిత్తశుద్ధితో పని చేస్తే ప్రజా మన్ననలు -ఎంఈఓ సుబ్బారావు

ప్రతి ఉద్యోగి ఉద్యోగ బాధ్యతలలో చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రజా మన్ననలు పొందుతారని ఎంఈఓ సుబ్బారావు అన్నారు. ముండ్లమూరు మండలంలోని కెల్లంపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా పని చేస్తూ బదిలీపై బట్లపల్లి ప్రాథమిక పాఠశాలకు వెళ్లిన గోగుల కోటేశ్వరరావును గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులను తీర్చిదిద్దడంలోనూ, ఉత్తీర్ణత సాధించడం తోపాటు పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. తోటి ఉపాధ్యాయులను సమన్వయం చేసుకొని పాఠశాల అభివృద్ధికి పాటుపడుతున్న వ్యక్తి అన్నారు. అనంతరం గోగుల కోటేశ్వరరావు దంపతులను పూలమాలలతో దుశ్యాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు జి కళ్యాణి, సురేష్ బాబు, వర్ధన్, శ్రీనివాసరావు, అనిత, స్వాతి, ఉల్లగల్లు ప్రధానోపాధ్యాయులు ఆదామ్, బాచిన పూర్ణచంద్రరావు, తిప్పిశెట్టి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *