ముండ్లమూరు మండలంలోని పలు పంచాయతీలోని ఖాళీగా ఉన్న వార్డు మెంబర్లు ఎన్నికకు ఆసక్తిగల అభ్యర్థులు ఆయా సచివాలయాల్లో నామినేషన్లు వేశారు. పసుపుగల్లు పంచాయతీ పరిధిలో గల చింతలపూడి 11వ వార్డు మెంబర్ ఖాళీగా ఏర్పడడంతో అవార్డు ఎన్నికకు మహిళ అభ్యర్థిగా సంగు విజయలక్ష్మి, పోచిపోకు మౌలిక నామినేషన్ వేశారు. ముండ్లమూరు పంచాయతీ పరిధిలోని వేంపాడు గ్రామంలో 11వ వార్డు కాళీ ఏర్పడడంతో అవార్డు మహిళా అభ్యర్థిగా గండి మరియమ్మ నామినేషన్ వేశారు. భీమవరం గ్రామంలో రెండవ వార్డు ఖాళీ ఏర్పడడంతో అవార్డు మహిళా అభ్యర్థిగా గుంటూరు నాగేంద్ర, వల్లెపు రమాదేవి నామినేషన్లు వేశారు పంచాయతీ ఎన్నికల అధికారులుగా పసుపుగల్లు కు ఎండి ఫారుక్, భీమవరం కే వెంకటేశ్వర్లు, ముండ్లమూరుకు ఎం వెంకటేశ్వర్లు ఎన్నికల అధికారులుగా పర్యవేక్షించారు.
