ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా చిన్నారులకు నియమించాలని వైద్యాధికారులు సూచించారు. చిన్నారులలో నులిపురుగులు ఉన్నట్లయితే మానసిక ఎదుగుదల లోపిస్తుందని వైద్యాధికారులు తెలిపారు. తాళ్లూరు మండలం లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో గురువారం జాతీయ నులిపురుగుల దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు.
తాళ్ళూరు పిహెచ్ పరిధిలో వైద్యాధికారి ఖాదర్ మస్తాన్ బి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఆల్బెండజోల్ మాత్రలను ఆయా పాఠశాలలో పంపిణీ చేశారు. తూర్పు గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వైద్యాధికారి బి.రత్నం, వైద్యురాలు మౌనికల ఆధ్వర్యంలో ఆల్బెండజోల్ మాత్రలను ఆయా పాఠశాలలో విద్యార్థులచే మింగించారు. తూర్పు గంగవరం సచివాలయం పరిధి ఈ ఓ ఆర్ డి కే జి ఎస్ రాజు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ పరిశీలించారు. మండల విద్యాశాఖ అధికారి జి సుబ్బయ్య ఆయా పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ పరిశీలించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఆయా కార్యక్రమంలో పాల్గొన్నారు .




