గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా మొ క్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై వుందని జడ్పీటీసీ మారం వెంకటరెడ్డి తెలిపారు. ఆజాదికా అమృత మహోత్సవం నాభూమి-నాదేశం కార్యక్రమ మములో భాగంగా తాళ్లూరు కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం నందు శుక్రవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల్లో వున్న మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారన్నారు . పూర్వా కాలంలో చెట్లు వుండటం వల్ల వాతావరణ సమతుల్యంగా వుండి సకాలంలో వర్షాలు కురిసేవాన్నారు. ప్రతిగ్రామంలో 75 మొక్కలు నాటాలన్నారు. మొక్కలు నాటటమే కాకవాటిని సంరక్షించి చెట్లుగా ఎదిగేవరకు కాపాడాలన్నారు. చెట్ల వల్ల స్వచ్చమైన గాలి అం దుతుందన్నారు. చెట్ల వల్ల భావితరాల ప్రజలు ఆరోగ్య వంతులుగా వుంటారన్నారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ ఐ.వెంకటేశ్వరరెడ్డి, ఈవోఆర్జే కెజియన్ రాజు, సర్పంచ్ మేకల
చార్లెస్ సర్జన్, ఏపివో మురళి, ఈసీప్రసాద్, పంచాయతీ కార్యదర్శి జె. లక్ష్మికాంత్, కెజీ బీవీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముందుగా ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటి సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
*మన్నెపల్లి పంచాయతీ పరిధి లో…..*
నా భూమి-నా దేశం కార్యక్రమం మన్నేపల్లి గ్రామ పంచాయితిలో సచివాలయం ఆవరణ లో స్వాతంత్య్రం వచ్చి 75 సంవ్సరాలు అయిన సందర్భంగా 75 మొక్కలు నాటి, ర్యాలీ నిర్వహించారు. ప్రతిజ్ఞ చేయుట జరిగింది. కార్యక్రమానికి తాళ్ళూరు మండలం వైస్.ఎం.పి.పి. ప్రియాంక నాగార్జున రెడ్డి, గ్రామ సర్పంచ్ మంచాల వెంకటేశ్వరరెడ్డి , డ్వామా దర్శి క్లస్టరు ఎ.పి.డి పద్మశ్రీ , పంచాయితీ కార్యదర్శి, సచివాలయం సిబ్బంది, ఎ.పి.ఒ. జె.కె. టెక్నికల్ అసిస్టెంట్, మరియు ఉపాధి కూలీలు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు.



