టెంట్ హౌస్ దగ్ధమై వ్యక్తి మృతి-మంటలు ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది -రూ.3 లక్షల వరకు ఆస్తినష్టం

టెంట్ హౌస్ దగ్ధమైన ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన దర్శి పట్టణంలో ఆది వారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. . దర్శికి చెందిన పోతంశెట్టి ప్రసాద్(45) గోల్డ్ షాపు నిర్వహిస్తుంటాడు. అతనికి చెందిన ఓ గదిని టెంట్ హౌస్ కి  అద్దెకు ఇచ్చాడు. ప్రసాద్ కుమారుడు విజయవా డలో చదువుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో విజయవాడ వెళ్లేందుకుబయలుదేరుతుండగా విరోచనాలు అవుతున్నాయని చెప్పడంతో భార్య, కుమార్తె వెళ్లారు. వారిద్దరూ విజయవాడ వెళుతుండగా బంధువులు ఫోన్ చేసి మీ టెంట్ దగ్ధమైందని, టెంట్ హౌస్ ప్రసాద్ తీవ్ర గాయాలతో ఉన్నాడని చెప్పడంతో వారు వెంటనే తిరిగి వెళ్లారు. టెంట్ హౌస్ నుంచి మంటలు వస్తుండటంతో స్థానికులు షట్టర్ తీసి చూడగా కాలిన గాయాలతో ప్రసాద్ ఉన్నాడు. వెంటనే అతన్ని 108లో దర్శి ప్రభుత్వ వైద్యశాలకు
తరలించారు. అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందుకున్న వెంటనే వచ్చి మంటలు ఆర్పారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ప్రసాద్ ను  పరీక్షించి పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో ఒంగోలుకు తీసుకువెళ్లారు. ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లగా వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

ప్రసాద్ గోల్డ్ షాప్ నిర్వ హిస్తుంటాడు. అందరితో కలిసిమెలిసి ఆప్యాయం గా పలకరిస్తూ ఉంటాడు. ప్రసాద్ మృతితో కుటుంబసభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు.
*రూ. 3లక్షల ఆస్తినష్టం..*
మంటల్లో టెంట్ సామాగ్రి పూర్తిగా దగ్ధం కాగా రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని స్థానికులు చెబుతున్నారు. పక్కనే ఉన్న నివాసంలో కిటికీలు తగులబడి లోపలికి మంటలు వ్యాపించాయి. టీవీ, ఇతర సామగ్రి కాలిపోయాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *