మండల కేంద్రమైన ముండ్లమూరులోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల తో పాటు పలు పాఠశాలలను పోలింగ్ బూత్లను దర్శి ఈఆర్ఓ లోకేశ్వరరావు శుక్రవారం పరిశీలించారు. ముందుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ బూత్ ను ఆయన పరిశీలించారు. రేసలైజేషన్ లో భాగంగా పోలింగ్ బూత్ ను ఆయన పరిశీలించారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలింగ్ బూత్ లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ జి పుల్లారెడ్డి, ఉపసర్పంచి బిజ్జం జ్యోతి కృష్ణారెడ్డి, ఆదర్శ పాఠశాల చైర్మన్ బిజ్జం సుబ్బారెడ్డి, మాజీ సర్పంచి ఇందూరు పిచ్చిరెడ్డి , సి ఓ దేవకాంత్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

