భారత ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ 73వ పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు నగరంలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యములో నగరంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ కార్యాలయం వద్ద నుండి కలెక్టరేట్ వద్ద ఎత్తున కార్యకర్తల రాకతో ఉత్సాహంగా నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం వద్ద ర్యాలీని ప్రారంభించిన పివి శివారెడ్డి మాట్లాడుతూ భారత 14వ ప్రధాని మొదీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రపంచ పటంలో భారతదేశానికి అద్భుతమైన గుర్తింపు వచ్చిందని, దేశ యువతను జగృతపరచి ప్రపంచంలో అగ్రస్థానానికి చేర్చారని, వారి స్ఫూర్తితో యువత దేశ రక్షణ, అభివృద్ధి పథంలో పయనించాలని కోరారు.
స్ధానిక శివాలయములో మోదీ జన్మదినొత్సవమును పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోదీ నేతృత్వంలో భారతదేశం విశ్వగురు కావాలని ఆకాంక్షించారు.
ర్యాలి అనంతరం స్థానిక విష్ణు ప్రియ కన్వెన్షన్ హాల్లో ఢిల్లీ నుండి ప్రధాని ప్రారంభించిన విశ్వకర్మ కళ్యాణ యోజన పథకాన్ని దృశ్యాన్ని వీక్షించారు. అనంతరం పథకంలో పొందుపరిచిన విధంగా 18 రకాల చేతివృత్తుల లబ్ధిదారులు చేనేత, వడ్రంగి, కుమ్మరి, నాయి బ్రాహ్మణ, స్వర్ణకార, శిల్పకళ, మేదర, చర్మకార, జంగందేవర, కంసాలి, పూలదండలు, మాదిగ, దొమ్మరి, కొండరాజులు, బోయలు, బెస్తలు, యాచకులు తదితరులను సమావేశపరిచి విశ్వకర్మ కళ్యాణ యోజన పథకం గురించి వివరిస్తూ సి.ఎస్.సి కేంద్రాలలో నమోదు చేసుకోవాలి. సి.ఎస్.సి సేవలు ఉన్న సచివాలయం కేంద్రాల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. రిజిస్ట్రేషన్ సమయంలో అభ్యర్థి 18 సంవత్సరాల వయసు నుండి ఉండాలని, పథకంలో సూచించిన 18 సాంప్రదాయకమైన చేతి వృత్తుల పనిలో కొనసాగుతూ ఉండాలని గత ఐదు సంవత్సరాలలో పీఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, పీఎం స్వనిధి, ముద్ర తదితర లోన్లు తీసుకుని ఉండకూడదని, లోన్లు తీసుకుని ఉన్నా ఆ రుణాలు చెల్లించేసి ఉండాలని మరియు కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మరియు వారి కుటుంబ సభ్యులు ఈ పథకానికి అనర్హులని తెలిపారు. రెండు దశల్లో ఐదు శాతం వడ్డీ రేటు తో లక్ష నుండి మూడు లక్షల వరకు రుణం లభిస్తుందని మరియు ఆయా వృత్తుల వారికి శిక్షణ ఇచ్చి ప్రధానమంత్రి కౌశల్య యోజన సర్టిఫికెట్ తో కూడిన గుర్తింపు కార్డు అందిస్తారని, శిక్షణ సమయంలో స్టైఫండ్ కూడా ఇస్తారని పథకపు ప్రయోజనాలు వివరించారు. విశ్వకర్మ జయంతి రోజున ఎంతో ప్రతిష్టాత్మకంగా 13000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి విశ్వకర్మ కౌసల్య యోజన పథకం ఆయా వృత్తులవారికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని ప్రకాశంజిల్లా బిజేపి అధ్యక్షులు పివి శివారెడ్డి తెలిపారు.
కార్యక్రమంలో మహిళా నాయకురాలు బొమ్మసాని పద్మావతి, జజ్జర కృష్ణవేణి, తీగల సత్యవతి, మరియు రాష్ట్రస్థాయి నాయకులు పివి కృష్ణారెడ్డి, బొద్దులూరి ఆంజనేయులు, శెగ్గం శ్రీనివాసరావు, నాగేంద్ర యాదవ్, సుబ్బారావు, తానికొండ సురేష్ యాదవ్, కఠారి సాయి కృష్ణ యాదవ్, దామోదర్, శివాజీ యాదవ్, కోరంకి నాగేశ్వరరావు, రాజేష్ వర్మ, నాయక్, పిన్నంటి తిరుమలరావు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



