తిరుపతి లో రామసేతు ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కలిశారు.
కుప్పంలో నిర్వహించిన థాంక్యూ సీఎం సార్ కార్యక్రమం, అలాగే ఇటీవల నెల్లూరు లో నిర్వహించిన విద్యా సదస్సు రెండు కార్యక్రమాలు విజయవంతం కావడంపై సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని అభినందించారు. భవిష్యత్తులో పార్టీ బలోపేతం దిశగా పనిచేయాలని చంద్రశేఖర్ రెడ్డి కి సూచించారు.. అనంతరం సీఎం కి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు..

