స్పందనలో వచ్చిన అర్జీల సమస్యలను పరిష్కరించండి

ముండ్లమూరు( గ్రామాల్లోని పలు రకాల సమస్యలను స్పందనలో వచ్చిన అర్జీల సమస్యలను పరిష్కరించాలని ఎంపీడీవో ఎన్ వి ఎల్ హనుమంతరావు అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల లోని సమస్యలను స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను పరిష్కరించాలని కోరారు. వర్షాకాలం మొదలైనందున మురుగు పారుదలకు ఆటంకం లేకుండా చేయించాలన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలపై ఏఎన్ఎం, ఆశాలు, వాలంటీర్లు ప్రతి ఇంటింటికి తిరిగి సర్వే చేయాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పలు రకాల సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందే విధంగా చూడాలన్నారు. గ్రామాల్లో చేస్తున్న పారిశుద్ధ కార్యక్రమాలు వివరాలు ఎప్పటికప్పుడు అధికారులకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డి , శ్రీదేవి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *