మహిళా సాధికారిత బిజేపి ప్రభుత్వంతోనే సాధ్యమని ఆపార్టీ మహిళా మోర్చా నాయకులు అన్నారు. మహిళా బిల్లు ఆమోదం తెలిపిన సందర్భంగా వారు హర్షం వ్యక్త చేస్తూ ప్రధాన నరేంద్ర మోదీ జీ చిత్ర పటానికి పాలాభిషేకం చేసారు. నూతన పార్లమెంటు భవనంలో మొదటి బిల్లు మహిళా బిల్లు ఆమోదం పొందటం ఎంతో శుభ పరిణామని అన్నారు. మహిళా సాధికారిత కోసం మోదీజీ ప్రవేశ పెట్టిన అనేక పథకాలను వివరించారు. నరేంద్ర మోదీకి ప్రతి మహిళ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మహిళా మోర్చా నాయకురాళ్లు తిండి వెంకటమ్మ, మాడపాకుల నారాయణమ్మ, శ్రీలక్ష్మి, చల్లా భూ లక్ష్మి, నాయకులు తిండి నారాయణ రెడ్డి, శ్రీనివాసులు, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

