దర్శి మండలంలోని ఎర్రోబనపల్లె, చందలూరు గ్రామాల్లో ఈక్రాప్ సూపర్ చెక్ ను జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు శుక్రవారం ఆక స్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో పొలాలకు వెళ్లి వీఏఏ, వీహెచ్ఎలను పిలిచి వారు చేసిన ఈక్రాప్ ఆ పొలంలో ఉందా లేదా చెక్ చేశారు. వారు నమోదు చేసిన పంట పొలంలో ఉన్న పంటలను పరిశీలించారు. నమోదు చేసిన ఎకరాలు, పంట ఉన్న విస్తీర్ణాలు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేసీ శ్రీని వాసులు మాట్లాడుతూ …ప్రతి రైతు పంట ఈ క్రాప్ తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. రైతులకు ప్రభుత్వం ద్వారా రావాల్సిన అన్నీ పథకాలు వర్తించేలా వారికి సహకారం అందించాలని కోరారు. తెలియని విషయాలు తెలియజేసి వారికి అండగా ఉం డాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏడీ బాలాజీ నాయక్, ఏఓ బాలకృష్ణ నాయక్, వీఏఏ, వీహెచ్ఎలు చంద్రకాంత్, కోటినాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు.

