షెడ్యూల్డ్ క్యాస్ట్ (ఎస్.సి.) ప్రజలు అధికంగా నివసిస్తున్న గ్రామాలలో అన్ని ప్రాధమికమౌలిక సదుపాయాలు కల్పించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి – జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్

షెడ్యూల్డ్ క్యాస్ట్ (ఎస్.సి.) ప్రజలు అధికంగా నివసిస్తున్న గ్రామాలలో అన్ని ప్రాధమిక
మౌలిక సదుపాయాలు కల్పించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం
అమలవుతున్న తీరుపై సంబంధిత అధికారులతో శనివారం కలెక్టరేట్లో ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ గ్రామాలలో తగిన మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు షెడ్యూల్డ్ క్యాస్ట్ ప్రజలకు మరియు షెడ్యూల్ క్యాస్టేతర ప్రజలకు మధ్య సామాజిక, ఆర్థిక అంతరాలను తొలగించేలా అధికారులు దృష్టి పెట్టాలని చెప్పారు. ఈ దిశగా తాగు నీరు – పారిశుధ్యము, విద్య, వైద్యం, సామాజిక భద్రత, గ్రామీణ రోడ్లు- హౌసింగ్, విద్యుత్, వ్యవసాయ విధానాలు, ఫైనాన్షియల్ ఇన్ క్లూజన్, డిజిటైజేషన్, జీవనోపాధి నైపుణ్యాభివృద్ధి – అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి వాటిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కాగా ఇప్పటివరకు రెండు విడతలలో ప్రస్తుత ప్రకాశం జిల్లాలో 99 గ్రామాలను ఈ పధకం క్రింద ఎంపిక చేసినట్లు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మా నాయక్ ఈ సందర్భంగా కలెక్టర్కు వివరించారు. ఈ గ్రామాలలో 500 పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఈ పనులను త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే పనులు చేపట్టిన కాంట్రాక్టర్లతో ఈ దిశగా చర్చలు జరపాలని దిశా నిర్దేశం చేశారు. నిధుల సమస్య (ఫండ్ గ్యాప్) ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ చెప్పారు. చేపట్టబోయే పనులను గుర్తించడానికి గ్రామస్థులతో సమావేశం నిర్వహించి వారి అవసరాలను తెలుసుకోవాలని, అనంతరం మండల స్థాయిలో సంబంధిత శాఖల అధికారులు సంయుక్త సమావేశం నిర్వహించి అవసరమైన చర్యలతో వచ్చే నెల 20వ తేదీ లోగా శాఖల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. ఎస్.సి.లు అధికంగా ఉంటున్న గ్రామాల రూపురేఖలు మార్చి వారికి అవసరమైన అన్ని ప్రాధమిక సదుపాయాలు కల్పించే లక్ష్యంతో ప్రవేశ పెట్టిన ఈ పథకాన్ని అదే స్ఫూర్తితో అమలు చేసేలా సంబంధిత శాఖలు చురుకైన పాత్ర పోషించాలని కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు.సమావేశంలో డి.ఆర్.డి.ఏ. పి.డి. రవికుమార్, ఐ.సి.డి.ఎస్. పి.డి. మాధురి, డి.ఈ.ఓ.సుబ్బారావు, జడ్పీ సి.ఈ.ఓ. జాలిరెడ్డి, ఇన్ఛార్జి డి.ఎం. హెచ్.ఓ. సురేష్ కుమార్, పంచాయతీరాజ్
ఎస్.ఈ. కొండయ్య, హౌసింగ్ పి.డి. పేరయ్య, ఎల్.డి.ఎం. అబ్దుల్ రహీం, డ్వామా, ఆర్.డబ్ల్యు.ఎస్.అధికారులు, ఎం.పి.డి.ఓ.లు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *