విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ప్రధానోపాధ్యాయురాలు ఎల్ మాధవి లత అన్నారు. దర్శి నియోజకవర్గ స్థాయిలో ఈనెల 21 ,22 తేదీల్లో జరిగిన ఆటల పోటీలలో ముండ్లమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెందిన విద్యార్థిని విద్యార్థులు విజయం సాధించి జిల్లా స్థాయి లో జరిగే ఆటల పోటీలకు ఎంపికయ్యారు. ఆటల పోటీలు ఈ విధంగా ఉన్నాయి. అండర్ 14 బాలుర విభాగంలో తాతపూడి దినేష్( ఫస్ట్) హై జంప్- గండి దేవా సహాయం, చల్లా మణికంఠ (త్రోబాల్) వరగాని రాజేష్, దాసరి నైసన్ బాబు, వరగాని ధనుష్,( టెన్నికాయిట్) అండర్ 14 బాలిక విభాగంలో మీనీగా రేణుక, గొల్లపాటి వైష్ణవి, (టెన్నికాయిట్ ) తాతపూడి దీక్ష (త్రో బాల్) అండర్ 17 బాలుర విభాగంలో కాకునూరి వంశీ(200) మీటర్లు( సెకండ్) ఎనుముల సాయి చరణ్ (ఫస్ట్) త్రిబుల్ జంప్- బిజ్జం శివారెడ్డి 800మీటర్లు (ఫస్ట్ తాతపూడి జెస్సి పాల్ హై జంపు ( ఫస్ట్) కొమ్మల నాగ)చరణ్, రావులపల్లి లవ కుమార్, సాయి చరణ్( త్రో బాల్’) కొండవీటి రాకేష్ (డిస్క్ త్రో) థర్డ్- అండర్ 17 బాలికల విభాగంలో కొంక అమృత వర్షిని, బిజ్జం శ్రీలక్ష్మి)( విజయం సాధించిన వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ జి భావన్నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
