మహిళలు ఆర్థిక సాధికారతను సాధించడానికి అవసరమైన అన్ని చర్యలు -రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

మహిళలు ఆర్థిక సాధికారతను సాధించడానికి అవసరమైన అన్ని చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నట్లు రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. శనివారం ఒంగోలులోని స్థానిక కొత్త కూరగాయల మార్కెట్ ఎదురుగా ఉన్న మహిళా స్వశక్తి భవనం నందు ఏర్పాటు చేసిన “జగనన్న మహిళా మార్ట్” ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ.ఎస్.దినేష్ కుమార్, మెప్మా డైరెక్టర్ విజయలక్ష్మి, ఒంగోలు ఎం.పి. శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసులు రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ….పట్టణ మహిళలకు వ్యాపార నైపుణ్యాలను పెంపొందించి సుస్థిర జీవనోపాధి కల్పించాలన్న ధ్యేయంతో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి జగనన్న మహిళా మార్జిలను మెప్మా సంస్థ ఆధ్వర్యంలో పట్టణాలలో నెలకొల్పుతున్నట్లు చెప్పారు. ఈ మార్ట్ల ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు ఉత్పత్తి చేస్తున్న వస్తువులకు మార్కెట్ ను కల్పిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలలో ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన అభివృద్ధి, సంక్షేమ పధకాలకు లబ్ధిదారులుగా ఎక్కువ శాతం మహిళలే ఉన్నట్లు మంత్రి తెలిపారు. ఎక్కడా దొరకని వస్తువులు కూడా ఈ మార్ట్లో దొరుకుతాయనే నమ్మకం ప్రజలలో కలిగేలా అభివృద్ధి చేయాలన్నారు. ఈ మహిళా మార్ట్ మహిళా పూల్ గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.
జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ మాట్లాడుతూ …ఒంగోలులో జగనన్న మహిళా మార్ట్ ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. మహిళలకు జీవనోపాధి కల్పించి ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో భాగంగానే ఈ మార్ట్లను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అద్దంకి నగర పంచాయతీ, మార్కాపురం మున్సిపాలిటీలలో మెప్మా ఆధ్వర్యంలో ఈ మార్ట్లలను ప్రారంభించినట్లు కలెక్టర్ తెలిపారు. పట్టణ సమాఖ్య పరిధిలోని స్వయం సహాయక సంఘ సభ్యులు ఒక్కొక్కరు కనీసం రూ.150ల పెట్టుబడితో సంఘ సభ్యులందరూ వాటాదారులుగా, నిర్వాహకులుగా మరియు కొనుగోలుదారులుగా జగనన్న మహిళా మార్ట్ నిర్వహించబడుతుందన్నారు. జగనన్న మహిళా మార్ట్ మ్యూచవల్లి ఎయిడెడ్ కో-ఆపరేటివ్ పొస్తెటీగా రిజిస్ట్రేషన్ చేయబడిందన్నారు. ఇందులో భాగంగా నిర్వహణ కమిటీ, సరుకు పరిశీలన.. కమిటీ, కొనుగోలు కమిటీ, ఆర్థిక కమిటీ అనే నాలుగు కమిటీలను ఏర్పాటు చేయడం
జరిగిందన్నారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో 2023 సెప్టెంబరు నాటికి 4,490 సంఘాలు ఉన్నాయన్నారు. ఈ సంఘాలలో మొత్తం 43,786 మంది సభ్యులు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో 33,731 మంది సభ్యులు రూ.150 ల చొప్పున పెట్టుబడితో మొత్తం రూ.50,63,650 లు కార్పస్ గా చెల్లించడం జరిగిందన్నారు. ఈ నగదుతో జగనన్న మహిళా మార్ట్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. బయట మార్కెట్ కంటే తక్కువ ధరలకే మరియు స్వయం సహాయక సంఘ సభ్యులకు 3 శాతం రిబేటుతో నాణ్యమైన సరుకులు అందించడం జరుగుతుందన్నారు. తద్వారా వచ్చే లాభాలతో పెట్టుబడుల సంఘాల వారీగా తిరిగి చెల్లించడం మరియు మార్కెట్ను భవిష్యత్తులో అభివృద్ధి చేసుకోవడానికి ప్రణాళికను తయారు చేసుకున్నారన్నారు.
రాష్ట్ర మెప్మా మిషన్ డైరెక్టర్ వి. విజయలక్ష్మి మాట్లాడుతూ… మహిళల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం జగనన్న మార్ట్లను ఏర్పాటు చేశారన్నారు. ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలలోని మహిళలలు అభివృద్ధి చెందే విధంగా అనేక రకాలుగా చేయూత నిస్తోందని ఆమె అన్నారు.
ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పధకాలను ప్రవేశ పెట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే మహిళా మార్గాలను ఏర్పాటు చేసి, ఇందులో పెట్టుబడి పెట్టిన సంఘ సభ్యులను వాటాదారులుగా, నిర్వాహకులుగా మరియు కొనుగోలుదారులుగా జగనన్న మాహిళా మార్ట్ నిర్వహించబడుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మహిళల ఎదుగుదలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వారి సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అన్ని పధకాలను సక్రమంగా వినియోగించుకుని మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. అన్ని రంగాలలో మహిళలకు సముచిత స్థానం కల్పించిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు.
ఒంగోలు, శాసన సభ్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ …జగనన్న మహిళా మార్ట్ ఒంగోలులో ప్రారంభించడం సంతోషదాయకమని అన్నారు. జగనన్న మహిళా మార్ట్ ఏర్పాటు కోసం అధికారులు తనను సంప్రదించిన వెంటనే మహిళా మార్ట్ భవన పునఃనిర్మాణము కోసం సి.ఎం. డెవలప్మెంట్ విధుల నుంచి రూ.10 లక్షలను వారికి అందించానని చెప్పారు. మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారన్నారు. ఇళ్ల స్థలాలు, చేయూత, ఆసరా, జగనన్న అమ్మ ఒడి వంటి పలు సంక్షేమ పధకాలు మహిళలలను లబ్ధిదారులుగా ఎంపిక చేసి ముఖ్యమంత్రి మహిళా పక్షపాతిగా నిలిచారని ఆయన
కొనియాడారు. రేపటి నుండి తన ఇంట్లో అవసరమైన సరుకులను ఈ మహిళా మార్ట్లోనే కొనుగోలు చేస్తామని ఆయన చెప్పారు. అదే విధంగా మేయర్, కార్పొరేటర్లు అందరూ ఈ మార్ట్ లోనే కొనుగోలు చేయాలని ఆయన కోరారు. ఈ మహిళా మార్ట్ అభివృద్ధి కొరకు అన్ని విధాల తన సహకారం ఎప్పుడు ఉంటుందని ఆయన చెప్పారు.
కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, మెప్మా పి.డి. రవి కుమార్, ఒడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, తదితర అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *