ప్రభుత్వం అందిస్తున్న సాంకేతికను ఉపయోగించి విద్యార్థులకు సబ్జెక్టులపై మరింత పరిజ్ఞానం అందించాలని మండల విద్యాశాఖాధికారి జి. సుబ్బయ్య అన్నారు. తూర్పు గంగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు బైజ్యూస్, స్మార్ట్ టీవీ, ఐఎఫ్పి ప్యానెను సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంఈఓ-2 సుధాకర్, రీసోర్సు పర్సన్ ఖాజావలి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
