ఈవీజింగ్ నేరం -జూనియర్ సివిల్ జడ్జి సరస్వతి

విద్యార్థినులను ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చేయడం నేరమని, అలా చేస్తే చట్టాలు కఠినంగా శిక్షిస్తాయని జూనియర్ సివిల్ జడ్జి జీవీఎల్ సరస్వతి సూచించారు. దర్శి పట్టణం లోని ఝాన్సీ మహిళా జూనియర్ కళాశాలలో చట్టంపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి సరస్వతి మాట్లాడుతూ… విద్యార్థులు అవమానాలు జరిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. కళాశాలల్లో చక్కగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.
చట్టాలు తెలుసుకుంటే భయం పోయి ధైర్యంగా చెప్పారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఎం.నారాయణ, పీ సురేష్, తదిత రులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *