స్వామి వారి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలి -మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి

స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖషంతోషాలతో జీవించాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాదరెడ్డి అన్నారు. వినాయక చవితి సందర్భంగా తాళ్లూరు మండలంలోని విఠలాపురంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరునికి మంగళవారం మాజీఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద రెడ్డి విశిష్ట పూజలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బూచేపల్లి శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ …ప్రజలలో ఐక్యమత్యాన్ని చాటేందుకు వినాయక చవితి నవరాత్రుల వేడుకలు నిమజ్జనోత్సవాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. గ్రామాల్లో ప్రజలు ఎటువంటి బేధాలు లేకుండా అందరూ కలిసి చేసుకునేది వినాయక చవితి అన్నారు. ఉత్స వాల స్పూర్తితో గ్రామాల్లో ప్రజలు సోదరాభావాన్ని పెంపొందించుకుని స్నేహపూర్వక వాతావరణంలో కలిసి మెలసి జీవించాలని అన్నారు. గణేశుని కృపతో అందరికి మంచి జరగాలని ఆకాంక్షించారు. తాళ్లూరు మండల సర్పంచ్ ల సంఘ అధ్యక్షుడు, జిల్లా సర్పంచ్ సంఘం ఉపాధ్యక్షులు మారం ఇంద్రసేనారెడ్డి, విగ్రహ కమిటీ సభ్యులు ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం నిమజ్జనోత్సవలో పాల్గొన్నారు. ట్రాక్టర్ ని నడుపి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. రాష్ట్ర వైకాపా సంయుక్త కార్యదర్శి, మాజీ ఎంపీపీ పోశం మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర వైకాపా సంయుక్త కార్యదర్శి ఐవీ సుబ్బారెడ్డి, దోసకాయలపాడు సర్పంచ్ వెంకట రామిరెడ్డి, సొసైటీ మాజీ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి , జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి జక్కల రామకృష్ణ పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *