విద్యార్థులు సబ్జెక్టుపై పట్టు సాధిస్తే జీవితంలో విజయావకాశాలు మెండుగా ఉంటాయని పెస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జవికే మూర్తి అన్నారు. స్థానిక పెస్ కళాశాలలో గురువారం ఇంజనీరింగ్ ట్రిపుల్ విద్యార్థులకు మ్యూట్ ల్యాబ్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుంటూరు వివిఐటీ చెందిన ప్రొఫిసర్ డాక్టర్ ఎస్. రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ లో వివిధ ఎలక్ట్రిక్ నెట్ వర్క్ ను అనుసంధానం చేయటానికి మ్యాట్ ల్యాబ్ ప్రాముఖ్యతను వివరించారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ ప్రస్తుత ఎలక్ట్రికల్ వాహనాల తయారీలో మ్యాట్ లాబ్ ఉపయోగిస్తారని చెప్పారు. సబ్జెక్టులో నిష్ణాతులైన ఆచార్యులతో ప్రతి విభాగంలో విద్యార్థులకు మరింత విజ్ఞానాన్ని అందించేందుకు యాజమాన్యం కృషి చేస్తుందని చెప్పారు. విద్యార్థులు ఉపయోగించుకుని చక్కగా మంచి ఉద్యోగ అవకాశాలు పొందాలని ఆక్షాంక్షించారు. ట్రిపుల్ ఈ విభాగపు అధిపతి బి. నాగరాజు, కో కన్వినర్ కెవి నారాయణ, కో ఆర్డినేటర్స్ కెవి శివా రెడ్డి, యం మల్లిఖార్జునరావు, కె జీవన్, అధ్యాపక బృందం పాల్గొన్నారు.


