రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి పెద్ద పీట వేయటమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఏర్పాటు చేసిందని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. తాళ్లూరు మండలంలోని మాధవరం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో శనివారం జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ…. ప్రజల ఆరోగ్యం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ కనపరచటం మనందరం గర్వించ దగిన విషయమని అన్నారు. ప్రతి పేద వానికి మెరుగైన వైద్య సేవలు అందించటమే లక్ష్యంగా గ్రామ స్థాయిలో స్పెషలిస్ట్ డాక్టర్ల పర్యవేక్షణలో అన్ని రకాల వ్యాథులకు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయటం జరుగుతుందని అన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో సచివాలయ వ్యవస్థను, వలంటీర్లు, జెసీఎస్ కన్వినర్లు, గృహ సారథులను భాగ స్వామ్యులను చేసి ఇంటింటి సర్వే ద్వారా రోగులను గుర్తించి వారికి అవసరమైన కార్పోరేట్ వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇలాంటి బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మన అందరం రుణపడి ఉన్నామని అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తున్న జగనన్నకు మన అందరం అండగా నిలవాలన్నారు. ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధిలో అధికారులను, ప్రజా ప్రతినిథులను భాగస్వామ్యులను చేసి సచివాలయ వ్యవస్థను బలోపేతం చేసిన సీఎం వైఎస్ జగనన్నను మరలా ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. గ్రామంలో డ్రైనేజి ‘సమస్య పరిష్కారానికి రూ. కోటి రూపాయలు కేటాయించి సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాలకు కృతజ్ఞతలు తెలిపారు. మూడు దశాబ్దాలుగా రాక పోకలకు రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యేకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి మాట్లాడుతూ …. ముఖ్యమంత్రి వైఎస్ జగనన్న పాలనలో కుల మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించటంతో అన్ని వర్గాలు ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని అన్నారు. ముందుగా వైద్యశిబిరం వద్ద ఏర్పాట్లను పరిశీలించి, వైద్యులతో మాట్లాడి వారు చేస్తున్న ఆరోగ్య సేవలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. 562 మందికి వైద్యపరీక్షలు, 82 మందికి కంటి పరీక్షలు, 42 మందికి కంటి అద్దాలు.. అవసరమైన మేర మందులు పంపిణీ చేసినట్లు వైద్యాధికారి షేక్ ఖాదర్ మస్తాన్ బి ఎమ్మెల్యేకి వివరించారు. అనంతరం వైద్యులు శ్రీనివాసులు ఎమ్మెల్యేకి వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ తాళ్లూరు మండలం ఇంచార్జ్ మద్దిశెట్టి రవీంద్ర, ఎఎంసీ చైర్మన్ షేక్ షకీలా అమీనా బాష, వైఎస్ ఎంపీపీలు ఐ. వెంకటేశ్వర రెడ్డి, ఎంఎన్పీ నాగార్జున రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి, జెసీఎస్ మండల కన్వినర్ యాడిక శ్రీనివాస రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు యాడిక యలమందా రెడ్డి, కోఆప్షన్మెంబర్ కరిముల్లా, మాజీ సర్పంచి నుసుం సుబ్బా రెడ్డి, టి. వెంకటేశ్వర రెడ్డి , తహసీల్దార్ ప్రసాద్, ఎంఈఓ సుబ్బయ్య, వైద్యాధికారులు షేక్ భాదర్ మస్తాన్, బి. రత్నం, వైద్యులు రాజేష్ యాదవ్, స్పెషలిస్ట్ వైద్యులు అరుణకుమారి, లీలా మెలాడ్ తదితరులు పాల్గొన్నారు.





