సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు.
ప్రజా సమస్యలకు పరిష్కారం చూపడం చేతకాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామిక హక్కులను హరిస్తూ నిర్బంధాలతో నిరంకుశ పాలన సాగిస్తున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు విమర్శించారు. స్థానిక సుందరయ్య భవన్లో ఆ పార్టీ కార్యకర్తల సమావేశం చిరుపల్లి అంజయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కంకణాల మాట్లాడుతూ ఎన్నికలకు ముందుగా ప్రజలకు ఇచ్చిన హామీలు పరిష్కారం చేయకపోగా, మళ్లీ ఎన్నికలు వస్తున్నా ఎప్పుడు పరిష్కరిస్తారు అని ప్రశ్నించిన ప్రజల్ని అక్రమంగా అరెస్టులు చేయడం నిర్బంధాలకు పాల్పడటం అమానుషమని అన్నారు. మొన్న అంగనవాడి వర్కర్స్ ను నేడు విద్యార్థి సంఘం కార్యకర్తలను అరాచక పద్ధతులతో అరెస్టులకు పూనుకున్నారని విమర్శించారు. దళితులు వ్యవసాయ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం విజయవాడ ధర్నా చౌక్ లో కనీసం ధర్నా నిర్వహించుకునేందుకు కూడా అనుమతి నిరాకరించడం రాష్ట్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడలకు నిదర్శనం అన్నారు.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రకృతి సంపదను, ప్రభుత్వ రంగాలన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్నదని అన్నారు. కేంద్రం ఆడమన్న నాటకాలన్నీ ఆడుతూ రాష్ట్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వ విధానాలన్నీ అమలు చేస్తున్నదని అన్నారు. వినాశకరమైన విద్యుత్తు రంగ సంస్కరణలు తెచ్చి ప్రజల మీద విపరీతమైన భారాలు మోపుతున్నదని అన్నారు. ఈ సంస్కరణలు అమలు జరిగితే వ్యవసాయం మరింత సంక్షోభంలో పోతుందని అన్నారు. ప్రజలు ఆహార భద్రతను కోల్పోతారని తెలిపారు. కేంద్రం తెచ్చిన నూతన విద్యా విధానం బడుగులను విద్యకు దూరం చేస్తున్నదని అన్నారు. విశాఖ ఉక్కును అదానికి అప్పజెప్పేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని ప్రజలు ఉద్యమాల్లోకి వచ్చి వాటిని అడ్డుకోవాలని ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వినాశకర విధానాలను ప్రశ్నించిన, నిరసించిన ప్రజాస్వామ్య గొంతులను అనచాలనుకోవడం అవివేకమని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు తాండవ రంగారావు, దరిశి మండల నాయకులు సందు వెంకటేశ్వర రావు, ఉప్పు నారాయణ, కెవి పిచ్చయ్య, ఉప్పుటూరి నాగరాజు, sk కాలే భాషా, రమాదేవి, దొనకొండ మండల నాయకులు కుందుర్తి అనిల్ తదితరులు పాల్గొన్నారు.
