ద్విచక్ర వాహనాలకు పర్మినెంట్ నంబర్ కేటాయించాలి – నవ్యాంధ్ర వికలాంగులహక్కులసేవవా సమితి రాష్ట్రఅధ్యక్షుడు షేక్ కాలేషా

ద్విచక్ర వాహనాలకు పర్మినెంట్ నంబర్ కేటాయించాలనినవ్యాంధ్ర వికలాంగులహక్కులసేవవా సమితి రాష్ట్రఅధ్యక్షుడు షేక్ కాలేషాకోరారు. ఏపీ విభిన్నప్రతిభా వంతుల, వయోవృద్ధుల సహాయ సంస్థ మెనే జింగ్ డైరెక్టర్ కు ఆయనశనివారం వినతి పత్రంఅందించారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1750త్రిచక్ర మోటార్ వాహనాలను ప్రభుత్వం అందించిందన్నారు.దివ్యాంగులకు ఇచ్చిన త్రిచక్ర వాహనాలకు పర్మినెంట్ నెంబర్ లేక పోవటంతో పలు రాయితీలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దివ్యాంగుల కోసం చేపట్టిన పథకాలకు పలు జిల్లాలలో జిల్లా మేనేజర్లు, ప్రాజెక్టు అధికారులు, సి.ఆర్.ఓ., లు సూపర్వైజర్లు తూట్లు పొడుస్తున్నారని అన్నారు. గత సంవత్సరము డిశంబరు 3వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా 1750 త్రిచక్ర మోటార్ వాహనాలను ఇవ్వమని ఆదేశిస్తే షుమారు 6నెలలు తరువాత దివ్యాంగులకు త్రిచక్ర మోటార్ వాహనాలను అందజేయడం జరిగిందని అన్నారు. ఆ తరువాత వారికి ఇచ్చిన త్రిచక్ర మోటార్ వాహనాలకు పలు జిల్లాలలో టెంపరరి రిజిస్ట్రేషన్లు చేసి షుమారు రూ. 600 వసూలు చేసి నెలలు గడుస్తున్నా నేటికీ పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయకపోవటంతో పలువురు దివ్యాంగులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ పెట్రోల్ కు దరఖాస్తులు చేసుకోవటానికి కూడా వీలు లేకపోవటంతో పదేపదే ఆ విషయాలను దివ్యాంగుల కార్పోరేషన్ జిల్లా మేనేజర్లకు, ప్రాజక్టు అధికారులకు, సి.ఆర్.ఓ.,లకు మరియు సూపర్వైజర్లకు తెలియపరిచినా నేటికీ చర్యలు లేవని అన్నారు. ఈ విషయాలను ఎప్పటికప్పుడు జిల్లా అధికారులకు తెలియజేసుకుంటున్నామని అయినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత త్రిచక్ర మోటార్ వాహనాలను పొందిన దివ్యాంగులు ఏదైనా ప్రమాదానికి గురిఅయితే పర్మినెంట్ రిజిస్ట్రేషన్ లేకపోవటంతో వారికి ఇన్సూరెన్స్ కూడా పొందలేని పరిస్థితిని అన్నారు .
కావున పై విషయాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించి, విచారించి వీలైనంత త్వరగా పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేయించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల మీద చర్యలు తీసుకొని ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురాగలరని కోరుకుంటున్నామని కోరారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *