జాతీయస్థాయి ఫుట్ బాల్ జుట్టులో తాళ్లూరు శ్రీ సరస్వతి హైస్కూల్ విద్యార్థులు స్థానం సంపాదించారు .అండర్ 15 విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టులో స్థానం సంపాదించి కేరళలోని పాల కాడ్ జిల్లాలో జరిగిన పోటీలలో రాష్ట్రస్థాయిలో అత్యున్నత ప్రతిభ కనపరిచి ఇరువురు విద్యార్థులు జాతీయస్థాయి జట్టులో చోటు సంపాదించారు. పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి రామాంజనేయులు, తొమ్మిదో తరగతి విద్యార్థి డి అఖిల్ జాతీయస్థాయి ఫుట్బాల్ జుట్టులో స్థానం సంపాదించారు. జాతీయస్థాయి జట్టులో చోటు సంపాదించిన విద్యార్థులను బుధవారం పాఠశాల ఆవరణలో శ్రీ సరస్వతీ విద్యా సంస్థల చైర్మన్ ఏవి రమణారెడ్డి అభినందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీరామమూర్తి, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు బిజ్జం అశోక్, ఉపాధ్యాయుని ,ఉపాధ్యాయులు విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
