జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని సర్పంచ్ మారం ఇంద్రసేనారెడ్డి అన్నారు. మండలంలోని విఠలాపురంలో గురు వారం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్భంగా 209 మంది రోగులకు పరీ క్షలు నిర్వహించారు వారందరికీ మందులు పంపిణీ చేశారు. 96 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి 35 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఆరుగురిని మెరుగైన వైద్యం కోసం రిఫర్ చేశారు. ఎంపీడీఓ కేవై కీర్తి, ఎంఈఓ జి సుబ్బయ్య , ఎంఎల్డీ నాగమల్లేశ్వరరావు, గైనకాలజిస్ట్ ప్రణవి, అరుణకుమారి, వైద్యాధికారులు షేక్ ఖాదర్ మస్తాన్ బి, రాజేష్ యాదవ్, మౌనిక తదితరులు పాల్గొన్నారు.
