ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుగులేని నేతగా చరిత్ర సృష్టిం చారని జెడ్పీ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. దర్శి మండలంలోని బసిరెడ్డిపల్లె గ్రామంలో దర్శి మండల సర్పంచ్ ల సంఘ అధ్యక్షుడు, స్థానిక సర్పంచ్ కేసరి రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహిం చిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మకు ఘనంగా స్వాగతం పలుకుతూ రెండు కిలోమీటర్ల పొడవున భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. డప్పు వాయిద్యాలు, దుశ్శాలు వాలు, పూలమాలలతో సత్కరించి హారతులిస్తూ ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ ప్రజలతో బూచే పల్లి వెంకాయమ్మ ఆప్యాయంగా మాట్లాడి సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపారు. ముందుగా జగ
నన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని ప్రారంభించి ఆయా వైద్య విభాగాలను పరిశీలించారు. టెస్ట్‌లు, మందులు, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ…
రాష్ట్రాన్ని సొంత కుటుం బంలా చూసుకుంటూ పరిపాలన సాగించిన వారిలో ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒకరైతే.. నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకరని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎదురులేని శక్తిగా వైఎస్సార్ సీపీ మారిందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు పేదల పాలిట వరాలుగా మారాయన్నారు. ప్రజలందరికీ ఉన్నత వైద్యం అందించాలనే ఉద్దేశంతో గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వ హించి అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు కూడా ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో నిలిచి
పోతుందన్నారు. ఇక్కడ తగ్గని జబ్బులకు పెద్దాస్ప త్రులకు తీసుకెళ్లి ఎంత ఖర్చయినా ప్రభుత్వం భరిం చి వ్యాధులు నయమయ్యేంత వరకు అండగా ఉండటం అభినందనీయమని కొనియాడారు. రానున్న ఎన్నికల్లో 175 సీట్లకు 175 సీట్లు సాధించి తీరు తామని జెడ్పీ చైర్పర్సన్ స్పష్టం చేశారు. బసిరెడ్డిపల్లె గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్ గోడకు జెడ్పీ నిధుల ద్వారా రూ.5 లక్షలు మంజూరు చేశారు. తాగునీరు, రోడ్ల అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేసి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో షేక్ కార్పొరేషన్ డైరెక్టర్, రాష్ట్ర వైద్య విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్ఎం బాషా, జిల్లా ఎంపీటీ సీల సంఘ జిల్లా అధ్యక్షుడు బండి గోపాల్ రెడ్డి, కౌన్సి లర్ మేడం మోహన్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవ దానం, మాజీ సర్పంచ్ లు ఉడుముల వెంకటరెడ్డి, చంద్రగిరి గురవారెడ్డి, నలదిమ్ము రమణారెడ్డి, వైద్యులు కిరణ్మయి, యాతం సురేఖ, ఎంపీడీఓ కుసుమకుమారి, డీటీ రవిశంకర్, నాయకులు శ్రీనివా సరెడ్డి, నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.




